![]() |
![]() |
.webp)
ఇస్మార్ట్ జోడి 3 లో లాస్య మంజునాథ్ ఎపిసోడ్ నిజంగా కన్నీళ్లు తెప్పించింది. వాళ్ళు చాలా యంగ్ ఏజ్ లోనే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే దాని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈ షో స్టేజి మీద చెప్పింది లాస్య . "మంజునాథ్ నాకంటే ఒక ఏడాది చిన్నవాడు...నాకు ఆ విషయం అప్పటికి తెలీదు. మేము పరిచయం ఐన ఎనిమిది నెలల్లోనే పెళ్లి చేసేసుకున్నాం. ఈ విషయాన్ని మా పేరెంట్స్ కి చెప్పాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎద్దుల్ని కొట్టే తాడుతో నన్ను మా నాన్న కొట్టారు. మంజునాథ్ మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
దానికి మా నాన్న ఆయనకు భోజనం పెట్టి ఈ పెళ్లి జరగదు అని చెప్పి పంపేశారు. ఐతే నేను ఇంట్లోంచి పారిపోయాను తర్వాత ఇద్దరం పెళ్లి చేసేసుకున్నాం. ఆ టైంకి మా పేరెంట్స్ వచ్చి పెళ్లి ఆపడానికి వచ్చారు. కానీ అప్పటికే పెళ్లి ఐపోయేసరికి ఏమీ అనలేక వెళ్లిపోయారు. మేము కడపలో పెళ్లి చేసుకుని ఆ రాత్రి హైదరాబాద్ వచ్చాము. ఐతే ఒకరోజు కొంత మంది వచ్చి ఇంట్లో అంతా వెతికేస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలీదు, ఎం మాట్లాడ్డం లేదు, ఏమీ చెప్పడం లేదు, ఎం వెతుకుతున్నారా తెలీదు. వేరే బాషా ఏదో మాట్లాడుతున్నారు. వెంటనే మంజునాథ్ కి ఫోన్ చేస్తే వచ్చాడు. తీరా వచ్చింది మంజునాథ్ ఇంటికి సంబంధించిన వాళ్ళు మా పెళ్లి సర్టిఫికెట్ కోసం వెతుకుతున్నారు. సడెన్ గా మమ్మల్ని ఆటో ఎక్కించేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నన్ను కాసేపు బయట నిలబెట్టేసారు. వాళ్ళ అమ్మ వచ్చి నా కొడుకును వదిలేయ్ అంటూ చెప్పారు. అప్పటి వరకు నాకు మంజునాథ్ మరాఠీ అనే విషయం నాకు తెలీదు. ఆరోజు నా మనసు ముక్కలైపోయింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే నా భర్త తక్కువైపోతాడని ఫీలయ్యా " అంటూ బాధపడింది లాస్య. ఐతే మంజునాథ్ కూడా మాట్లాడుతూ "లాస్య తన జీతంతోనే నన్ను బతికించింది. ఎందుకంటే నాకు రెండేళ్లు జాబ్ అనేది లేదు." అని చెప్పాడు.
![]() |
![]() |